అస‌లు నోట్ల ర‌ద్దు గురించి జైట్లీకి తెలుసా?

Sun,March 5, 2017 02:38 PM

Finance Ministry refused to disclose whether Arun Jaitley was consulted before the notes ban announcement

న్యూఢిల్లీ: ఆర్బీఐ కాదు.. మంత్రులు కాదు.. ప్ర‌భుత్వం కాదు.. అస‌లు నోట్ల ర‌ద్దు గురించి సాక్షాత్తు ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి తెలుసా? ఆర్థిక‌శాఖ తీరు ఈ కొత్త ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తుతున్న‌ది. అరుణ్ జైట్లీకి నోట్ల ర‌ద్దు గురించి తెలుసా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆర్థిక శాఖ స‌మాధానం ఇవ్వ‌డానికి తిరస్క‌రించింది. అంత‌కుముందు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం, ఆర్బీఐ కూడా ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి నిరాక‌రించాయి. ఆర్థిక‌మంత్రి లేదా చీఫ్ ఎక‌న‌మిక్ అడ్వైజ‌ర్‌కు ఈ విష‌యం తెలుసా లేదా అన్న‌ది ఆర్టీఐ కింద స‌మాచారం ప‌రిధిలోకి రాద‌ని పీఎంవో, ఆర్బీఐ వాదించాయి. ప్రెస్ ట్ర‌స్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఆర్టీఐ కింద ఆర్థిక శాఖ‌ను ఈ ప్ర‌శ్న అడిగింది. అయితే ఈ ప్ర‌శ్న‌కు సంబంధించిన రికార్డులు త‌మ ద‌గ్గ‌ర ఉన్నా.. స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద వీటిని బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌లేమ‌ని ఆ శాఖ స్ప‌ష్టంచేసింది.

ఆర్టీఐలోని మిన‌హాయింపు క్లాజ్ ఆధారంగా ఈ ప్ర‌శ్న‌కు బ‌దులివ్వ‌లేమ‌ని ఆర్థిక శాఖ చెప్పింది. ఎందుకు స‌మ‌ధాన‌మివ్వ‌డం లేద‌న్న స‌మాచారాన్ని మాత్రం ఆ శాఖ వెల్ల‌డించ‌లేదు. ఈ సెక్ష‌న్ కింద మినహాయింపు పొందాలంటే అది దేశ భ‌ద్ర‌త‌, స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిగించేదై ఉండాలి లేదా వ్యూహాత్మ‌క‌, శాస్త్ర‌, ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన విష‌య‌మై ఉండాలి. కానీ ఈ విష‌యంలో అలాంటిదేమీ లేక‌పోవ‌డం గ‌మనార్హం. నోట్ల ర‌ద్దుకు సంబంధించి ఆర్బీఐ, ప్ర‌ధాన‌మంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ‌లే బాధ్యులు. కానీ ఈ మూడు శాఖ‌లూ స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తున్న‌ది.

1618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles