రిటైర‌వ్వండి.. 12 మంది ఆఫీస‌ర్ల‌కు ఆర్థిక‌శాఖ ఆదేశాలు

Tue,June 11, 2019 10:24 AM

Finance Ministry orders 12 senior government officers to retire over allegations of corruption, sexual abuse

హైద‌రాబాద్: మోదీ స‌ర్కార్ అతిపెద్ద నిర్ణ‌యం తీసుకున్న‌ది. అధికార దుర్వినియోగానికి పాల్ప‌డిన 12 మంది కేంద్ర ఆర్థిక‌శాఖ ఆఫీస‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ది. వెంట‌నే ఉద్యోగాల‌కు రాజీనామా చేయాలంటూ ఆ ఆఫీస‌ర్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవినీతి, అక్ర‌మ సంపాద‌న‌, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆర్థిక‌శాఖ ఆఫీస‌ర్ల‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వేటుకు గురైన వారిలో ఓ చీఫ్ క‌మిష‌న‌ర్‌, ప్రిన్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఐటీశాఖ క‌మిష‌న‌ర్లు ఉన్నారు. జ‌న‌ర‌ల్ ఫైనాన్షియ‌ల్ రూల్ 56 ప్ర‌కారం ఆఫీస‌ర్లు అంతా రిటైర్ కావాలంటూ ఆదేశించింది. ఒక్కొక్క ఆఫీస‌రుపై ఒక్కొక్క ర‌క‌మైన ఆరోప‌న‌ణ‌లు ఉన్న‌ట్లు తేలింది.

ఇంటికి పంపించిన‌ వారిలో ఇన్‌కంట్యాక్స్ జాయింట్ క‌మీష‌న‌ర్ అశోక్ అగ‌ర్వాల్‌, క‌మిష‌న‌ర్ ఎస్‌కే శ్రీవాత్స‌వ‌, హోమీ రాజ‌వంశ్‌, బీబీ రాజేంద్ర ప్ర‌సాద్‌లు ఉన్నారు. అశోక్ అగర్వాల్ ఓ వ్యాపార‌వేత్త నుంచి భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇద్ద‌రు ఐఆర్ఎస్ ర్యాంక్ మ‌హిళా ఆఫీస‌ర్ల‌ను ఎస్‌కే శ్రీవాత్స‌వ వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కేంద్ర ఆర్థిక‌శాఖ రిటైర్మెంట్ జాబితాలో అజ‌య్ కుమార్‌, అలోక్ కుమార్ మిత్రా, చాంద‌ర్ సైనా భార‌తి, అందాసు ర‌వింద‌ర్‌, వివేక్ బ‌త్రా, శ్వేతా సుమ‌న్‌, రామ్ కుమార్ భార్గ‌వ‌లు ఉన్నారు.

2223
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles