వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు పూర్తి.. చితికి నిప్పంటించిన దత్తపుత్రిక

Fri,August 17, 2018 05:04 PM

final rites of vajpayee completed in smriti sthal

న్యూఢిల్లీ: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన దత్తపుత్రిక నమిత భట్టాచార్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నమిత చితికి నిప్పంటించారు. త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాజ్‌పేయి భౌతికకాయానికి ప్రధాని మోదీ కడసారి నివాళులర్పించారు. వాజ్‌పేయి అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎల్‌కే అద్వానీ, అమిత్ షా, బీజేపీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భూటాన్ రాజు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రులు, అఫ్ఘనిస్థాన్ మాజీ ప్రెసిడెంట్ కర్జాయ్, పాకిస్థాన్ న్యాయశాఖ మంత్రి వాజ్‌పేయి అంత్యక్రియలకు హాజరయ్యారు.

3184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles