గోవాలో మర్డర్ కేసులో ఇరుక్కున్న తెలంగాణ టూరిస్టులు

Fri,January 12, 2018 06:14 PM

Fifteen tourists from Telangana face murder case in Goa Panaji

పనాజి: వెంకి పెండ్లి సుబ్బు చావుకు వచ్చిందన్నట్లు... కొత్త సంవత్సరం వేడుకలను ఎంజాయ్ చేద్దామని వచ్చిన తెలంగాణ టూరిస్టులు మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. తెలంగాణకు చెందిన 15 మంది టూరిస్టులు గోవాలో ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు. కొత్త సంవత్సరం వేడుకల కోసం వాళ్లు మినీ బస్సులో గోవాకు వెళ్లారు. జనవరి 1న రాత్రి గోవాలోని కాల్నాట్‌లో ఉన్న గెస్ట్ హౌజ్‌లో ఓ గొడవ జరిగింది. గెస్ట్ హౌజ్‌లో ఉన్న సిబ్బందితో టూరిస్టులు గొడవ పడ్డారు. దీంతో గెస్ట్ హౌజ్ సిబ్బందిలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లను గోవా మెడికల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. గొడవలో తీవ్రంగా గాయపడిన వారిలో జయేశ్ భండారి అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

అయితే.. గొడవ జరిగిన రోజే టూరిస్టులను అరెస్ట్ చేసిన పోలీసులు వాళ్లను కొల్వాలేలోని సెంట్రల్ జైలుకు తరలించారు. హత్యాయత్నం కేసులో ఇదివరకు వీళ్లను బుక్ చేసిన పోలీసులు.. దానితో పాటు మర్డర్ కేసును కూడా నమోదు చేశారు. టూరిస్టులు దర్శన్, శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, సయ్యద్ ఉస్మాన్, సయ్యద్ బదిరుద్దిన్, పురుషోత్తం రెడ్డి, నరసింహ రెడ్డి, అజయ్, శ్రీనివాస్, కృష్ణ, కిరణ్, అంజనేయులు, భోపాల్, దేవానంద్ అంజన, అంజనయ్య, బాలయ్యల‌ను విచారించేందుకు పోలీసులు త్వరలోనే కోర్టు అనుమతిని కోరనున్నారు. ఇక.. టూరిస్టులు తీసుకొచ్చిన మిని బస్సును కూడా పోలీసులు సీజ్ చేశారు.

4194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles