మా చావుకు అనుమతివ్వండి ప్రధాని గారూ..

Wed,June 19, 2019 01:15 PM

Father and daughters write to PM over water scarcity in Uttar Pradesh

లక్నో : మా చావుకు అనుమతివ్వండి ప్రధాని గారూ అని ఓ వ్యక్తి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్‌రాష్‌ గ్రామంలో తీవ్రమైన నీటి కొరత ఉంది. ఒక వేళ నీరు లభించినా అది ఉప్పు నీరే. దీంతో ఆ గ్రామ ప్రజలకు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన చంద్రకల్‌ సింగ్‌, అతని ముగ్గురు కుమార్తెలు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు.

తమ గ్రామంలో తీవ్రమైన నీటి కొరత ఉంది.. సమస్యను పరిష్కరించండి.. లేదంటే తమ చావుకు అనుమతి ఇవ్వండి అంటూ మోదీకి రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. ఉప్పునీటిని తాగలేకపోతున్నామని తమ గోడును చెప్పుకున్నారు. సురక్షితమైన మంచి నీటిని కొందామంటే తమ వద్ద డబ్బులు కూడా లేవని తెలిపారు. ఈ నీటి వల్ల పంటలు కూడా పండటం లేదన్నారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ వారు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వేరే మార్గం లేదు.. చావే మార్గమని చంద్రకల్‌ సింగ్‌ పేర్కొన్నారు.

గ్రామానికి చెందిన రాకేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఇక్కడున్న నీటిలో ఆమ్లం ఎక్కువగా ఉందని, జంతువులు కూడా ఈ నీటిని తాగలేకపోతున్నాయని తెలిపారు. మంచినీటి కోసం సుమారు 3 నుంచి 4 కిలోమీటర్లు వెళ్లాలి అని పేర్కొన్నారు.

2604
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles