గ్రేలిస్టులో పాక్‌.. ఇక విదేశీ రుణాలు క‌ష్ట‌మే

Fri,February 22, 2019 04:19 PM

FATF keeps Pakistan on Greylist, condemns Pulwama attack

హైద‌రాబాద్ : పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సంస్థ‌లు.. ఆంక్ష‌ల వ‌త్తిళ్లను పెంచుతున్నాయి. పుల్వామా దాడి నేప‌థ్యంలో తాజాగా ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్‌(ఎఫ్ఏటీఎఫ్‌) కూడా పాక్ వ్య‌వ‌హార తీరును ఖండించింది. ఉగ్ర‌వాద నియంత్ర‌ణ కోసం పాకిస్థాన్ ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేద‌ని ఆ సంస్థ ఆగ్ర‌హించింది. 38 స‌భ్య దేశాలు ఉన్న ఎఫ్ఏటీఎఫ్ .. టెర్ర‌ర్ ఫండింగ్‌, మ‌నీ ల్యాండ‌రింగ్ లాంటి కేసుల‌ను ప‌రిశీలిస్తుంది. జైషే మ‌హ్మ‌ద్‌, ల‌ష్క‌రే తోయిబా లాంటి ఉగ్ర సంస్థ‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌లేద‌ని ఆరోపించింది. దీంతో ఆ దేశాన్ని గ్రే లిస్టు నుంచి తొల‌గించ‌డం లేద‌ని ఎఫ్ఏటీఎఫ్ వెల్ల‌డించింది. పాక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాల‌ని భార‌త్ డిమాండ్ కూడా చేసింది. ఎఫ్ఏటీఎఫ్ ఒక దేశాన్ని గ్రేలిస్టులో పెట్ట‌డం వ‌ల్ల ఆ దేశానికి అంత‌ర్జాతీయ రుణాల రాక త‌గ్గుతుంది. పారిస్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈనెల 14వ తేదీన పుల్వామాలో జ‌రిగిన దాడిని ఎఫ్ఏటీఎఫ్ ఖండించింది. డ‌బ్బు లేకుండా అలాంటి దాడులు జ‌ర‌గ‌వ‌ని, అంటే ఉగ్ర‌వాద మ‌ద్ద‌తుదారుల‌కు నిధులు మ‌ళ్లుతున్న‌ట్లే అని ఆ సంస్థ తెలిపింది.

1909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles