రైతుల డబ్బు తీసుకొని అంబానీ జేబులు నింపుతున్నారు!

Fri,November 30, 2018 04:59 PM

Farmers mega rally in Delhi seeking farm loan waivers and better MSPs

న్యూఢిల్లీ: రైతన్న కదం తొక్కాడు. దేశ రాజధాని ఢిల్లీ పిక్కటిల్లేలా కేంద్ర సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాడు. వివిధ రాష్ర్టాలకు చెందిన 35 వేల మంది రైతులు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సహా 21 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాలో మాట్లాడుతూ మోదీ తీరును తీవ్రంగా ఎండగట్టారు రాహుల్‌గాంధీ. 15 మంది పారిశ్రామిక వేత్తల రుణాలను మాఫీ చేసినప్పుడు రైతుల రుణాలను మాత్రం ఎందుకు మాఫీ చేయరంటూ ప్రశ్నించారు. రైతులు కేవలం వాళ్ల హక్కును మాత్రమే అడుగుతున్నారు. కానీ వాళ్ల డబ్బంతా అనిల్ అంబానీ జేబుల్లోకి వెళ్తున్నది. మీకు ప్రసంగాలు తప్ప ఏమీ దక్కడం లేదు అని రాహుల్ విమర్శించారు.


రైతుల రుణాలు మాఫీ చేయాలని, మద్దతు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రైతులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల పుర్రెలను చేతుల్లో పట్టుకొని వాళ్లు ఈ ర్యాలీ పాల్గొన్నారు. రైతులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నదో అర్థం కావడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. బీమా యోజన పెద్ద మోసమని, రైతుల ఖాతాల నుంచి భారీగా సొమ్ము తీసుకొని, తీరా పంట నష్టపోయిన సమయంలో ఏవేవో షరతులు విధిస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.

1489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles