రైతులు త‌ల్ల‌డిల్లుతున్నారు.. లోక్‌స‌భ‌లో రాహుల్‌

Thu,July 11, 2019 12:34 PM

Farmers are suffering, Rahul Gandhi tells in Lok Sabha

హైద‌రాబాద్‌: లోక్‌స‌భ‌లో ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశ రైతులు త‌ల్ల‌డిల్లుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం రైతు స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టాల‌న్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో ప్ర‌భుత్వం రైతుల‌కు ఎటువంటి ఊర‌ట క‌ల్పించ‌లేద‌ని రాహుల్ అన్నారు. కేర‌ళ ప్ర‌భుత్వం ఇచ్చిన నివేదిక‌ను ఆర్బీఐ స్వీక‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాహుల్ కేంద్రాన్ని కోరారు. రిక‌వ‌రీ నోటీసుల‌తో రైతులను బెదిరించ‌కుండా చూసుకోవాల‌న్నారు. రుణం తీర్చ‌లేక ఓ రైతు వ‌య‌నాడ్‌లో బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు చెప్పారు. సుమారు 8 వేల మంది రైతుల‌కు వ‌య‌నాడ్‌లో నోటీసులు ఇచ్చార‌న్నారు. రుణాల‌కు ప్రాప‌ర్టీ అటాచ్ చేయ‌డం వ‌ల్లే రైతులు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్న‌ట్లు రాహుల్ చెప్పారు.

1670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles