లోకేష్‌.. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?

Wed,February 20, 2019 04:37 PM

Farmer Kotayyas Suicide Creates Political Heat in AP Politics

అమరావతి: సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పంట పొలాన్ని ధ్వంసం చేసి రైతును కొట్టి చంపిన పోలీసు అధికారులపై హత్యకేసు నమోదు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కోటయ్య మృతిపై జ్యూడీషియల్‌ ఎంక్వైరీ వేసి వాస్తవాలు వెలుగులోకి తేవాలని.. పోలీసుల భిన్న వాదనలపై విచారణ చేయించాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో విజయ సాయిరెడ్డి స్పందించారు. కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు చంద్రబాబు? అమరావతికి 50 కి.మీ దూరంలో ఉన్న కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప్టర్‌లో వెళ్లాలా? హెలిప్యాడ్‌ కోసం రైతు ప్రాణాన్ని బలితీసుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్‌ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్న? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

4456
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles