పుల్వామా దాడి.. జ‌వాన్ల‌ కుటుంబాల‌కు కోటి

Wed,July 17, 2019 05:17 PM

Families of soldiers killed in Pulwama given Rs 1 Crore in Aid

హైద‌రాబాద్‌: క‌శ్మీర్‌లోని పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌ దాడిలో సుమారు 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ జ‌వాన్ల కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం కింద ఒక్కొక్క‌రికీ సుమారు కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఇచ్చిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఎక్స్‌గ్రేషియాగా 35 ల‌క్ష‌లు, డ్యూటీ స్టేట్ నుంచి 5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా, సీఆర్‌పీఎఫ్ రిస్క్ ఫండ్ ణుంచి 20 ల‌క్ష‌లు, సీఆర్‌పీఎఫ్ సెంట్ర‌ల్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 1.5 ల‌క్ష‌లు, ఎస్బీఐ పారామిలిట‌రీ సాల‌రీ ప్యాకేజ్ నుంచి 30 ల‌క్ష‌లు ఇచ్చిన‌ట్లు కేంద్ర హోంశాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ త‌న స‌మాధానంలో పేర్కొన్నారు. జ‌వాన్ల కుటుంబాల‌కు స్వంత రాష్ట్రాలు కూడా త‌మ వంతు ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడికి పాల్ప‌డిన అయిదుగురు ఉగ్ర‌వాదుల్లో న‌లుగుర్ని హ‌త‌మార్చిన‌ట్లు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి జి కిష‌న్ రెడ్డి తెలిపారు. ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. మ‌రో ఉగ్ర‌వాదిని అరెస్టు చేశామ‌న్నారు. ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం వ‌ల్ల దాడి జ‌రిగింద‌న్న వాద‌న‌ను కిష‌న్ రెడ్డి కొట్టిపారేశారు. నిఘా సంస్థ‌ల‌న్నీ ఒక‌టికి ఒక‌టి స‌హ‌క‌రించుకుంటున్నాయ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఉగ్ర‌వాదాన్ని స‌హించ‌బోద‌న్నారు.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles