కేరళలో నకిలీ వార్తల వరద

Mon,August 20, 2018 05:25 PM

Fake news in flooded Kerala worrying the Authorities

తిరువనంతపురం: కేరళ ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతోపాటు నకిలీ వార్తలతోనూ పోరాడుతున్నది. ఓవైపు లక్షలాది మంది నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే.. మరోవైపు అదే స్థాయిలో నకిలీ వార్తలు ముంచెత్తుతున్నాయి. ఏకంగా ఇండియన్ ఆర్మీకి సంబంధించే ఓ నకిలీ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. ఇలాంటి వాటిని నమ్మొద్దని ఇండియన్ ఆర్మీకి చెందిన అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తన ట్విటర్ పేజ్‌లో కోరింది. ఆ నకిలీ వీడియోలో ఓ వ్యక్తి తనకు తాను ఆర్మీ ఆఫీసర్‌ను అని చెప్పుకుంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌ను నిందిస్తున్నట్లుగా ఉంది. రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తిగా ఇండియన్ ఆర్మీకి ఇవ్వడం లేదంటూ విజయన్‌ను ఆ వ్యక్తి నిందించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. శనివారం రాత్రి నుంచి ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిపోయింది. భారతీయ మహిళా మోర్చా తలస్సరి నియోజకవర్గం ఫేస్‌బుక్ పేజ్ నుంచి ఎక్కువ షేర్లు ఉన్నాయి. మొత్తం 28 వేల షేర్లు చేయడం విశేషం. వాట్సాప్‌లోనూ ఈ వీడియో వైరల్ అయింది.

ఇక మరో ఆడియో క్లిప్ కూడా ఇలాగే చెక్కర్లు కొడుతున్నది. సురేశ్ కొచ్చాట్టిల్ అనే వ్యక్తి ఈ ఆడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కేరళ వరదల్లో చిక్కుకున్న వాళ్లంతా బాగా డబ్బున్న వాళ్లని, వాళ్లకు ఎలాంటి సాయం చేయాల్సిన అవసరం లేదని ఆ ఆడియో క్లిప్‌లో అతను చెప్పాడు. అంతేకాదు సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల వినియోగంపైనా అనుమానాలు వ్యక్తంచేస్తూ.. ఇక నుంచి ప్రజలు సేవా భారతిలాంటి స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చాడు. కేరళ రాష్ట్రం బయట కూడా ఈ ఆడియో క్లిప్ వైరల్‌గా మారిపోయింది. దీనిపై ఇప్పటికే కేరళలో సాయం అందిస్తున్న వారి నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ రంగంలోకి దిగి ఇలాంటి నకిలీ వార్తలను సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

2736
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles