కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. 687 ఫేస్‌బుక్‌ పేజీల తొల‌గింపు

Mon,April 1, 2019 03:25 PM

Facebook removes 687 pages linked to congress ahead of polls

హైద‌రాబాద్: ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్‌కు భారీ షాక్ త‌గిలింది. సోష‌ల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌.. ఆ పార్టీకి సంబంధం ఉన్న సుమారు 687 పేజీల‌ను తొల‌గించింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌తో సంబంధం ఉన్న వ్య‌క్తుల‌ న‌కిలీ అకౌంట్లు, పేజీల‌ను తొల‌గించిన‌ట్లు ఇవాళ ఫేస్‌బుక్ వెల్ల‌డించింది. కాంగ్రెస్‌పార్టీకి చెంద‌ని అకౌంట్ల తీరు స‌రిగా లేనందున వాటిని తొల‌గిస్తున్న‌ట్లు ఎఫ్‌బీ చెప్పింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ దీనిపై కామెంట్ చేయ‌లేదు. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్‌లో ప‌నిచేసే వారి వ్య‌క్తిగ‌త అకౌంట్ల‌తో సంబంధం ఉన్న ఎఫ్‌బీ పేజీల‌ను తొల‌గించిన‌ట్లు ఎఫ్‌బీ సైబ‌ర్‌సెక్యూర్టీ హెడ్ న‌థానియ‌ల్ గ్లిచ‌ర్ తెలిపారు. యూజ‌ర్ల‌ను త‌మ పోస్టుల‌తో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నందు వ‌ల్లే ఫేక్ అకౌంట్ల‌ను తొల‌గించిన‌ట్లు ఎఫ్‌బీ చెప్పింది. వాస్త‌వానికి ఆ పోస్టుల్లో ఉండే స‌మాచారంతో సంబంధం లేద‌ని, కానీ ఎఫ్‌బీని అనుచిత ప‌ద్ధ‌తుల్లో వాడ‌డాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాంగ్రెస్‌కు చెందిన మ‌రో 103 పేజీల‌ను తొల‌గించామ‌న్నారు. పాకిస్థాన్ కేంద్రంగా ఈ నెట్‌వ‌ర్క్ కొన‌సాగుతున్న‌ట్లు గుర్తించారు. పాకిస్థాన్ నుంచి ఫేక్ అకౌంట్ల‌ను ఆప‌రేట్ చేస్తున్నందున వాటిని తొల‌గిస్తున్న‌ట్లు కూడా ఎఫ్‌బీ వెల్ల‌డించింది. మిలిట‌రీ ఫ్యాన్ పేజీలు, పాక్ సంబంధిత వార్త‌ల పేజీలు, క‌శ్మీర్ సంబంధిత పేజీలు కూడా ఉన్నాయి. అయితే పాకిస్థాన్ సైన్యానికి చెందిన ఇంట‌ర్ స‌ర్వీస్ ప‌బ్లిక్ రిలేష‌న్స్‌(ఐఎస్‌పీఆర్‌) ఉద్యోగులు ఈ న‌కిలీ అకౌంట్ల‌ను న‌డిపిస్తున్న‌ట్లు ఎఫ్‌బీ విచార‌ణ‌లో తేలింది.1187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles