భార‌త వైమానిక ద‌ళం కోసం.. ఎఫ్ 21 వ‌స్తోంది

Wed,February 20, 2019 03:45 PM

F21 fighter jet to be developed in India, says Lockheed Martin

హైద‌రాబాద్: అమెరికా ఫైట‌ర్ జెట్ ఎఫ్‌-21.. ఇప్పుడు భార‌త అమ్ముల‌పొదిలో చేర‌నున్న‌ది. అమెరికా కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ త‌యారు చేసే.. ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు భార‌త్ సొంతం కానున్నాయి. భార‌త్‌కు చెందిన టాటా కంపెనీ.. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఎఫ్‌-21 యుద్ధ విమానాల‌ను త‌యారు చేయ‌నున్న‌ది. భార‌తీయ వైమానిక ద‌ళం కోసం వీటిని ప్ర‌త్యేకంగా రూపొందించారు. వాయుశ‌క్తిలో భార‌త్‌ను అత్యంత శ‌క్తివంతంగా మార్చేందుకు ఈ యుద్ధ విమానం తోడ్ప‌డ‌నున్న‌ది. లాక్‌హీడ్ మార్టిన్‌, టాటా క‌ల‌యిక‌... భార‌త వైమానిక ద‌ళానికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వ‌నున్నాయి. ఎఫ్‌-21 త‌యారీతో అమెరికా, భార‌త్‌.. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మ‌రింత ప‌దిలం చేసుకోనున్నాయి. ఎఫ్‌-21 త‌యారీతో భార‌త్‌లో అనేక ఉద్యోగాల‌కు అవ‌కాశం ల‌భించ‌నున్న‌ది. అత్యంత త‌క్కువ ధ‌ర‌లోనే ఈ యుద్ధ విమానాన్ని త‌యారు చేయ‌నున్నారు.2600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles