విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు

Fri,January 18, 2019 01:42 PM

Explosion in Visakhapatnam Steel Plant, number three furnace stopped

విశాఖ: విశాఖ‌ప‌ట్ట‌ణం స్టీల్ ప్లాంట్‌లో ఇవాళ పేలుడు సంఘ‌ట‌న జ‌రిగింది. మూడ‌వ నెంబ‌ర్ బ‌ట్టీలో మెట‌ల్ పైపు పేలింది. ఈ ఘ‌ట‌న వ‌ల్ల ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. మార్నింగ్ షిఫ్ట్ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ముంద‌స్తుగా ప్రొడ‌క్ష‌న్ ఆపేశారు. పేలుడుకు సంబంధించిన కార‌ణాల‌ను విచారిస్తున్నారు. మూడ‌వ ఫ‌ర్నేస్‌లో ప్ర‌తి రోజు 8వేల మిలియ‌న్ ట‌న్నుల స్టీల్‌ను ఉత్ప‌త్తి చేస్తారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల వ్య‌క్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని ఐఎన్‌టీయూసీ డిమాండ్ చేసింది.

965
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles