ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కచ్చితమైనవి కావు : వెంకయ్య నాయుడు

Sun,May 19, 2019 10:29 PM

Exit polls do not mean exact polls says Venkaiah Naidu

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మే 19న సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కచ్చితమైన ఫలితాలు కావు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నారు. 1999 నుంచి అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాల మాదిరిగా ఎన్నికల ఫలితాలు రాలేదని ఆయన గుర్తు చేశారు. ప్రతి పార్టీ కూడా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తాయి. కాబట్టి మే 23వ తేదీ వరకు వేచి ఉండడం మంచిదని వెంకయ్య పేర్కొన్నారు. ఈ దేశం సమర్థవంతమైన నాయకుడిని, స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. అది ఎవరైనా ఉండొచ్చు. సమాజంలో మార్పు రాజకీయ పార్టీలతోనే ప్రారంభం కావాలని వెంకయ్య నాయుడు అన్నారు.

2758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles