న్యూఢిల్లీలో మాజీ సైనికుల ‘సైనిక్ ఏక్తా ర్యాలీ’

Sat,September 12, 2015 06:07 PM

Ex service men sainik ektha rally in new delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓఆర్‌ఓపీపై మాజీ సైనికులు చేస్తోన్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఈమేరకు ఇవాళ ఉదయం జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులు సైనిక్ ఏక్తా ర్యాలీని నిర్వహించారు. ఓఆర్‌ఓపీపై మొన్న ప్రభుత్వం చేసిన ప్రకటనను మాజీ సైనికులు వ్యతిరేకిస్తోన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన మాజీ సైనికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాగా, గత మూడు నెలలుగా ఢిల్లీ వేదికగా యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ (యూఎఫ్‌ఈఎస్‌ఎం) పేరుతో ఏకమై ఓఆర్‌ఓపీని సాధించుకునేందుకు మాజీ సైనికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఈ సంస్థలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే.

873
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles