గుజ‌రాత్‌, కేర‌ళ‌లో మొరాయించిన ఈవీఎంలు

Tue,April 23, 2019 10:00 AM

EVM snags reported in early hours of polling from Gujarat, Kerala

హైద‌రాబాద్ : ఇవాళ 13 రాష్ట్రాల్లో లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌రుగుతున్న‌ది. గుజ‌రాత్‌తో పాటు కేర‌ళ‌లోనూ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ స్పందించారు. ఈవీఎం సాంకేతిక స‌మ‌స్య‌ల గురించి ఈసీ దృష్టి పెట్టింద‌ని భావిస్తున్న‌ట్లు సీఎం అన్నారు. క‌న్నూరులో ఇవాళ ఉద‌యం ఆయ‌న ఓటేశారు. తిరువ‌నంత‌పురంలోని ఓ బూత్‌లో కొంత సేపు ఓటింగ్ నిలిపేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో కొంత సేపు ఓటింగ్‌ను ఆపారు. అయితే జిల్లా క‌లెక్ట‌ర్ ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు.

879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles