ఈవీఎంలను ట్యాంపర్ చేయలేరు..

Mon,December 18, 2017 02:41 PM

EVM machines cant be tampered, says CEC ex officials

అహ్మాదాబాద్: ఈవీఎంలను ట్యాంపర్ చేశారు. అందుకే బీజేపీ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఈవీఎంలకు బ్లూటూత్ కనెక్ట్ అవుతున్నదని గుజరాత్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు ఫిర్యాదు కూడా చేశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించిన మాజీ అధికారులు ఈ విషయంపై ఇవాళ కొంత స్పష్టతను ఇచ్చారు. ఈవీఎంలను, వీవీప్యాట్‌లను ట్యాంపర్ చేయలేమని సీఈసీ మాజీ చీఫ్ హెచ్‌ఎస్ బ్రహ్మ తెలిపారు. ఈ అంశంపై గతంలో అనేకసార్లు పరీక్షలు నిర్వహించామని, ఇక దాని గురించి ఆలోచించడం మానివేయాలన్నారు. ఈవీఎం ఓ మెషీన్ అని, దాన్ని హ్యాక్ చేయడం కుదరదని బ్రహ్మ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈవీఎంలను ట్యాంపర్ చేయలేరని సీఈసీ మాజీ చీఫ్ నవీన్ చావ్లా తెలిపారు. గతంలో బీజేపీ కూడా ఈవీఎంల అంశంపై అనుమానాలు వ్యక్తం చేసిందని, అప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై ప్రదర్శనలు నిర్వహించామని, వాటిని ట్యాంపర్ చేయలేమని నవీన్ చావ్లా అన్నారు. ఈవీఎంలు దేనికి కనెక్ట్ కావు అని సీఈసీ మాజీ చీఫ్ ఎన్ గోపాలస్వామి అన్నారు. బ్లూటూత్, వైర్‌లెస్‌తో ఈవీఎంలను ట్యాంపర్ చేయలేమన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మరోలా ఆరోపణలు చేస్తున్నది. ప్రజల ఓట్ల వల్ల కాదు, బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్ల గెలిచిందని ముంబై కాంగ్రెస్ చీప్ సంజయ్ నిరుపమ్ ఆరోపించారు.1572
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles