నాలుగో విడుత పోలింగ్‌కు అంతా సిద్ధం

Mon,April 29, 2019 07:05 AM

everything is ready for fourth phase polling

న్యూఢిల్లీ: నేడు లోక్ సభ ఎన్నికలకు నాగులో విడుత పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. 9 రాష్ర్టాల పరిధిలోని 72 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 72 స్థానాలకు పోటీలో 945 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే.. పోలింగ్‌కు అంతా సిద్ధమయింది. పోలింగ్ కేంద్రాలు కూడా సిద్ధమయ్యాయి. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను కనెక్ట్ చేసి పెట్టారు. మాక్ పోలింగ్ కూడా పూర్తయింది. ప్రజలు కూడా ఓటింగ్ లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు.

మహారాష్ట్రలో 17, రాజస్థాన్-13, ఉత్తర్‌ప్రదేశ్-13, పశ్చి మబెంగాల్- 8, మధ్యప్రదేశ్-6, ఒడిశా-6, బీహార్ 5, జార్ఖండ్‌లోని 3 స్థానాలతో పాటు జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ లోక్‌సభా స్థానంలోని ఓ భాగంలో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగో విడుతతో మహారాష్ట్రలో పోలింగ్ పరిసమాప్తం అవుతుంది. రాష్ట్రంలో ఈ విడుతలో 17 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles