వాళ్లు పాక్ ఉగ్ర‌వాదులే: యురోపియ‌న్ యూనియ‌న్‌

Wed,September 18, 2019 03:10 PM

హైద‌రాబాద్‌: క‌శ్మీర్ అంశాన్ని భార‌త్‌, పాకిస్థాన్ దేశాలు నేరుగా చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాని ఇవాళ యురోపియ‌న్ యూనియ‌న్ అభిప్రాయ‌ప‌డింది. కశ్మీర్ స‌మ‌స్య‌ను శాంతియుత ప్ర‌తిపాద‌న ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది. ఇవాళ జ‌రిగిన ఈయూ స‌మావేశాల్లో పోలాండ్‌కు చెందిన క‌న్జ‌ర్వేటివ్ నేత రిజార్డ్ కార్నెకి మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో భారత్ అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌న్నారు. భార‌త్‌లోని జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడుల గురించి ఆలోచించాల‌న్నారు. ఈ ఉగ్ర‌వాదులు ఆకాశం నుంచి రాలిప‌డ‌లేద‌ని, వారంతా పొరుగుదేశం నుంచి వ‌స్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఉగ్ర‌వాద విష‌యంలో భార‌త్‌కు మ‌నం మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్నారు. ఇక ఇట‌లీకి చెందిన పుల్వియో మార్టుసెలి అనే క్రిస్టియ‌న్ డెమోక్రాట్ కూడా ఈయూ స‌భ‌లో మాట్లాడారు. అణ్వాయుధాలు వాడుతామ‌ని పాక్ నేరుగా హెచ్చ‌రించింద‌న్నారు. యూరోప్‌లో పాక్ ఉగ్ర‌వాదులు దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు పుల్వియో ఆరోపించారు.


1715
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles