ఇథనాల్‌తో 12వేల కోట్లు ఆదా చేస్తాం..

Fri,August 10, 2018 01:27 PM

Ethanol output will save India Rs 12,000 crore, says Modi

న్యూఢిల్లీ: ఇథనాల్ ఉత్పత్తిని రానున్న నాలుగేళ్లలో 450 కోట్ల లీటర్లకు పెంచనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దీని ద్వారా భారత్‌కు సుమారు 12 వేల కోట్ల లాభం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వాలు ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రోత్సహించలేదని ఆరోపించారు. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలోనే ఇథనాల్ బ్లెండింగ్ ప్రారంభమైందని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మాత్రం ఈ పథకాన్ని కొనసాగించలేదని, ప్రస్తుతం 141 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి జరుగుతున్నదని, దాన్ని 450 కోట్ల లీటర్లకు పెంచనున్నామని, దీని వల్ల 12వేల కోట్ల దిగుమతి ఖర్చును ఆదా చేసుకోవచ్చు అని మోదీ తెలిపారు. వరల్డ్ బయోఫ్యూయల్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. 10వేల కోట్ల ఖర్చుతో 12 జీవ ఇంధన రిఫైనరీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2022 వరకు పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను బ్లెండ్ చేసే ప్రక్రియను అభివృద్ధి చేస్తామన్నారు. 2030 వరకు దాన్ని 20 శాతం పెంచనున్నట్లు చెప్పారు. బయోఫ్యూయల్ రిఫైనరీల వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.

1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles