ఎర్నాకులం రైల్వేస్టేషన్‌లోకి భారీగా వరద నీరు

Wed,July 18, 2018 12:21 PM

తిరువనంతపురం : కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. ఎర్నాకులం జంక్షన్ రైల్వేస్టేషన్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రైల్వేస్టేషన్‌లోని గదుల్లోకి వర్షపు నీరు రావడంతో ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. రైలు పట్టాలపై మోకాళ్ల లోతులో వర్షపు నీరు నిలవడంతో.. రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కొట్టాయం - ఇట్టుమనూరు మధ్య 10 రైళ్లను, ఎర్నాకులం - పునలూరు మధ్య రెండు రైళ్లను రద్దు చేశారు. ఎర్నాకులం జంక్షన్‌కు దగ్గర్లో ఉన్న నివాసాల్లోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

1866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles