బంగారం తరలింపు వివాదంపై టీటీడీ స్పష్టత

Mon,April 22, 2019 12:54 PM

EO Anil Kumar singhal clarification on TTD Gold

హైదరాబాద్‌ : బంగారం తరలింపు వివాదంపై టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీకి రావాల్సిన బంగారం వచ్చినందున మరింత స్పష్టత ఇస్తున్నామని ఆయన తెలిపారు. టీటీడీకి సంబంధించి మొత్తం 9,259 కిలోల బంగారం ఉందన్నారు. గోల్డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ 2000, ఏప్రిల్‌ 1న ప్రారంభమైందని చెప్పారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో 5,387 కిలోలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)లో 1,381 కిలోల బంగారం డిపాజిట్‌గా ఉందన్నారు. పీఎన్‌బీలో 1,381 కిలోల బంగారం డిపాజిట్‌ మెచ్యూరిటీ గడువు ఈ నెల 18కి ముగిసింది. మెచ్యూరిటీ అంశంపై 27 మార్చినే పీఎన్‌బీకి లేఖ రాశామని తెలిపారు. బంగారాన్ని టీటీడీకి అప్పగించే పూర్తి బాధ్యత పీఎన్‌బీదే అని స్పష్టం చేశారు. పీఎన్‌బీ వచ్చి ట్రెజరీలో ఇస్తే అది టీటీడీ బంగారం అవుతుందన్నారు. ఏప్రిల్‌ 18కి బదులుగా ఏప్రిల్‌ 20కి బంగారం అందజేశారు. మాకు కావాల్సింది బంగారం అప్పగించడమే.. మిగతా విషయాలు మాకు అనవసరమని చెప్పారు. గోల్డ్‌ మెచ్యూరిటీ అంశం అందరికీ తెలియకపోవచ్చు అని ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

తమిళనాడులో టీటీడీకి సంబంధించిన 1,381 కిలోల బంగారాన్ని ఈసీ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బంగారాన్ని చెన్నైలోని పీఎన్‌బీలో భద్రపరిచారు. గడువు ముగియడంతో బ్యాంకు అధికారులు టీటీడీకీ అప్పగించేందుకు రెండు వాహనాల్లో ఈ నెల 17వ తేదీన తిరుమలకు తరలించారు. ఈ క్రమంలో తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో వేపంపట్టు చెక్‌పోస్టు వద్ద ఎన్నికల అధికారులు, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి బంగారానికి సంబంధించిన ఆధారాలు చూపించడంతో ఆ బంగారాన్ని పీఎన్‌బీకి అప్పగించారు ఈసీ అధికారులు.

2287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles