ఢిల్లీని పొగ కమ్మేస్తే..గంభీర్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు

Fri,November 15, 2019 07:18 PM


న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ తీరుపై ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వైపు ఢిల్లీ నగరాన్ని పొగ కమ్మేసి జనాలు ఇబ్బంది పడుతుంటే..ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ మాత్రం ఇండోర్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారని ఆప్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించింది. ఢిల్లీ కాలుష్యంపై సమీక్షించేందుకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నేడు నిర్వహించతలపెట్టిన అత్యవసర సమావేశం..అధికారులు, సభ్యులు రాకపోవడంతో చివరి నిమిషంలో రద్దెంది. ఈ స్టాండింగ్‌ కమిటీలో ఈస్ట్‌ ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కూడా ఉండగా..హాజరవలేదు.


అయితే ఇండోర్‌లో ఓ ఫుడ్‌ కోర్టు దగ్గర గౌతమ్‌ గంభీర్‌తో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తున్న ఫొటోలను క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఆప్‌ ఈ ఫొటోలను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌ లో ఈ ఆరోపణలు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి ఎంసీడీ కమిషనర్‌, డీడీఏ వైస్‌ ఛైర్మన్‌, వాతావరణ విభాగం సెక్రటరీ, జాయింట్‌ సెక్రటరీతోపాటు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు సమావేశానికి రాలేదు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి 21 మంది లోక్‌సభ ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు హాజరుకావాల్సి ఉండగా..కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయినట్లు తెలుస్తోంది.




1624
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles