కదిలే రైలులో నుంచి కాలువలో పడ్డ యువతి..

Wed,September 13, 2017 04:03 PM

Engineering student falls into lake from train


కోచి: ఓ యువతి కదిలే రైలులో నుంచి ప్రమాదవశాత్తు కాలువలో పడిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న మత్య్సకారుడు ఆమెను సురక్షితంగా ప్రాణాలతో రక్షించాడు. ఆరతి రవీంద్రన్ ( 24)అనే ఇంజినీరింగ్ విద్యార్థిని ఎర్నాడ్ ఎక్స్‌ప్రెస్‌లో తిరువనంతపురానికి వెళ్తుంది. రైలు ఆరూర్-కుంబలం బ్రిడ్జి మీదుగా వెళ్తున్న సమయంలో ఆమె డోర్ దగ్గరకు వచ్చి నిలబడింది. ఆరతి రవీంద్రన్ డోర్‌ను పట్టుకున్న సమయంలో సడెన్‌గా బ్యాలెన్స్ తప్పడంతో.. బ్రిడ్జిపై నుంచి కిందున్న కాలువలో పడిపోయింది. కాలువలో బోటుపై వెళ్తున్న మత్స్యకారుడు ఆమెను కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles