వీడియో: గన్‌పాయింట్‌లో బెదిరించి యువకుడికి పెళ్లి!

Sat,January 6, 2018 06:06 PM

Engineer allegedly forced to get married at gunpoint in Patna bihar

పాట్నా: బీహార్‌లో ఓ యువకుడికి బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి వద్దంటూ ఏడుస్తున్నా.. అతన్ని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టారు. గన్‌పాయింట్‌లో పెళ్లి చేసుకోవాలని బెదిరించారు. లబోదిబోమని అరుస్తున్న ఎవరూ వినిపించుకోలేదు. అమ్మాయి నుదుటన బొట్టు పెట్టాలంటూ ఆ యువకున్ని ఓదార్చారు. కానీ ఎవరూ ఆ పెళ్లిని అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు.ఈ ఘటన పాట్నాలోని ఓ ప్రాంతంలో జరిగింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్‌గా చేస్తున్న వినోద్ కుమార్ ఇటీవల ఓ మిత్రుడి పెళ్లికి ఓ ఊరుకు వెళ్లాడు. ఆ పెళ్లిలో ఓ వ్యక్తి వినోద్‌కు దోస్తీ అయ్యాడు. అక్కడ నుంచి వాళ్లు పాట్నాకు వెళ్లారు. అలా పరిచయమైన ఆ వ్యక్తి.. ఇంజినీర్ వినోద్‌ను బలవంతంగా తన చెల్లల్ని పెళ్లి చేసుకునేలా చేశాడు. ఇదంతా వినోద్ సోదరుడికి తెలిసింది. అతను ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. అమ్మాయిని తీసుకెళ్లాలంటూ ఇప్పుడు అబ్బాయి ఇంట్లో వాళ్లకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పాట్నా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఓ రిపోర్ట్ ప్రకారం 2016లో ఇలా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న ఫిర్యాదులు సుమారు 3000 వరకు అందినట్లు తెలుస్తున్నది.

ఇక‌... ఈ బ‌ల‌వంత‌పు పెళ్లి వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది. నెటిజ‌న్లు.. అయ్యో పాపం... అత‌డికి ఏం దుస్థితి వ‌చ్చిందంటూ పెళ్లి కొడుకుపై తెగ జాలి చూపిస్తున్నారు.

4220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles