ఎదురుకాల్పుల్లో జవాను, ఇద్దరు ఉగ్రవాదుల హతం

Thu,May 16, 2019 08:29 AM

encounter Two terrorists killed one jawan has lost his life Operation continues

జమ్ముకశ్మీర్: రాష్ట్రంలోని పుల్వామాలోని డాలిపోరా ప్రాంతంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఒక ఇంట్లో ఆయుధాలతో దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి చెందగా, భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి మరో ముగ్గురు ఉగ్రవాదులు పరారయ్యారు. పారిపోయిన ముష్కరుల కోసం దళాలు గాలిస్తున్నాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా పరిసర ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు.

936
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles