కశ్మీర్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు: మోదీ

Thu,August 8, 2019 08:41 PM

Employment create for local youths in jammukashmir


న్యూఢిల్లీ: కశ్మీరీలకు ఇంతకాలం పడిన వేదన నుంచి సమానత్వం లభిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్ పునర్విభజనపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ..కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉద్యోగులకు లభించే సౌకర్యాలన్నీ కశ్మీరీలకు లభిస్తాయన్నారు. జమ్మూకశ్మీర్ పోలీసులకు కూడా కేంద్రప్రభుత్వ ఉద్యోగుల హోదా లభిస్తుంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలన్న నిర్ణయం ఫలితాలు త్వరలో కనిపిస్తాయని మోదీ తెలిపారు.

కశ్మీర్ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోదీ తెలిపారు. పారదర్శకత, కొత్త పని విధానం అభివృద్ధికి బాటలు వేస్తుంది. కేంద్రప్రభుత్వ సంస్థల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, కొత్త రహదారులు వస్తాయి. స్థానిక యువతకు సైన్యం, రక్షణ బలగాల్లో ఉపాధి లభిస్తుంది. కొత్త రైల్వే లైన్లు, ఎయిర్ పోర్టులు వస్తాయి. కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలనే నిర్ణయం చాలా ఆలోచించి చేసింది. కొద్దికాలం కోసం చేసిన నిర్ణయం కశ్మీరీల భవిష్యత్ కోసమే. కొద్దికాలం కోసమే కేంద్రపాలిత ప్రాంతంగా ఉంచాలనే నిర్ణయం ఫలితాలు త్వరలో కనిపిస్తాయని ప్రధాని మోదీ అన్నారు.

1310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles