వ‌చ్చే ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయి: మమతా బెనర్జీ

Tue,March 27, 2018 02:56 PM

elections in 2019 will certainly be very interesting, says Mamata Banerjee


న్యూఢిల్లీ: రాజకీయవేత్తలు కలిస్తే సాధారణంగా రాజకీయాల గురించే మాట్లాడుకుంటారని, అందులో దాచిపెట్టాల్సింది ఏమీలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇవాళ ఆమె ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుసుకున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్‌ను తీసుకురావాలన్న ఉద్దేశంతో దీదీ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఆమె అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతిలను మమతా బెనర్జీ కలుసుకున్నారు.1809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS