తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక వ్యాఖ్యలు

Fri,September 7, 2018 04:33 PM

Election Commission will take stock of preparation from CEO Telangana Chief Electoral Officer

ఢిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానిధికారి ఓపీ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం అసెంబ్లీ రైద్దెతే వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఆరు నెలలు ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం లేదు. రైద్దెన అసెంబ్లీకి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నిలక నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో చర్చిస్తామని ఆయన తెలిపారు.

కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల అంశంపై ఎన్నికల సంఘం చర్చించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌కు పిలుపువచ్చింది. ఇవాళ సాయంత్రం వరకు ఢిల్లీకి రావాలని ఆయనను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 31 జిల్లాల కలెక్టర్లతో రజత్ కుమార్ సమావేశమై ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అవసరాలపై సమీక్షించారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల విధానంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఓటింగ్‌కు ముందు అన్ని ఓ ప్రణాళికబద్ధంగా జరుగుతాయన్నారు రజత్ కుమార్. ఓటింగ్ తేదీలు ప్రకటించే నాటికి తాము అన్ని విధాలా సిద్ధంగా ఉంటామని ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు.

3509
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles