మే 6న ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్

Thu,May 2, 2019 10:09 AM

election commission orders re polling in five booths in Andhra Pradesh

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కేసరపల్లి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పల్లెపాలంలోని ఇసుకపల్లి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకాని తిప్ప, ప్రకాశం జిల్లా యర్రగొండలపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో ఈ నెల 6వ తేదీన రీ పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా ఈ పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏప్రిల్ 11వ తేదీన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles