కేంద్ర ఎన్నికల సంఘంతో ముగిసిన ర‌జ‌త్ కుమార్‌ భేటీ

Mon,September 10, 2018 07:25 PM

Election Commission CEO Rajat Kumar Meets CEC Over Telangana Early Polls

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకోదని చెప్పారు. ప్రస్తుత సమావేశం కేవలం ప్రాథమిక స్థాయిలోనే జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించామని తెలిపారు.

రేపు వచ్చే అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వాలో చర్చించాం. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే తప్పనిసరిగా సవరిస్తాం. తెలంగాణలో ఎన్నికల కసరత్తు, సంసిద్ధత అంశాలను సంఘానికి వివరించాం. ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా బృందం తెలంగాణలో పర్యటించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. సుమారు 5గంటల పాటు కేంద్ర ఎన్నికల అధికారులతో రజత్ కుమార్ పలు అంశాలపై చర్చించారు.

1886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles