మసూద్‌ అజార్‌, పబ్‌జి దిష్టిబొమ్మల దహనం

Wed,March 20, 2019 12:20 PM

Effigies of JeMs Masood Azhar and PUBG game to set on fire during Holika Dahan in Mumbai

ముంబై: ఉత్తర భారత‌దేశంలో హోలీని రెండు రోజుల పండుగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్‌ లేదా చోటీ హోలీ అని జ‌రుపుకుంటారు. హోలీ పండుగను చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. హోలీ పండుగను ముంబై వాసులు వినూత్నంగా జరుపుకున్నారు. హోలికా అనే రాక్షసి పేరుతో జైష్‌-ఏ- మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజార్‌, యువతను పట్టిపీడిస్తున్న పాపులర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్‌జీ దిష్టిబొమ్మలను తయారు చేశారు. పండుగలో భాగంగా వాటిని కాల్చి వేశారు. అనంతరం రంగులతో హోలీ సంబరాలు చేసుకున్నారు.

పుల్వామా ఉగ్రదాడిలో భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాడుల సూత్రధారి మసూద్‌ అజార్‌ భారత్‌లో చేస్తున్న దాడులకు నిరసగా అతని దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే, పబ్‌జీ గేమ్‌ మాయలో పడి ప్రతీ రోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. గేమ్‌ వల్ల చోటు చేసుకుంటున్న దుష్పరిణామాలపై సమాజంలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 'పబ్‌జీ: ది సర్జికల్‌ స్ట్రైక్స్‌' పేరుతో దిష్టిబొమ్మను కాల్చివేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles