మాల్యా.. మోస్ట్ వాంటెడ్ !

Fri,June 22, 2018 04:55 PM

ED seeks fugitive offender tag for Vijay Mallya


న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యాపై కొత్త చట్టం కింద భారత ప్రభుత్వం భారీ చర్యలను తీసుకోవాలనుకుంటున్నది. బ్యాంకు రుణాలు ఎగవేసిన వారిని మోస్ట్ వాంటెడ్‌గా గుర్తించాలని భావిస్తున్నది. మాల్యాకు చెందిన సుమారు 12,500 కోట్ల ఆస్తులను జప్తు చేయాలని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నిర్ణయించింది. ముంబై కోర్టులో దీనికి సంబంధించిన ఈడీ ఓ దరఖాస్తును ఫైల్ చేసింది. ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్ కింద ఆ కేసును నమోదు చేశారు. పరారీలో ఉన్న లోన్ డిఫాల్టర్‌గా పరిగణిస్తూ మాల్యా ఆస్తులను సీజ్ చేయాలని కూడా నిర్ణియంచారు. మాల్యాకు చెందిన కంపెనీలు, స్థిరచరాస్థులను కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. రుణాలు ఎగవేసిన కేసులో ఈడీ ఇప్పటి వరకు మాల్యాపై రెండు ఛార్జ్‌షీట్‌లను దాఖలు చేసింది.

1202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles