ఈడీ విచారణకు హాజరైన చందాకొచ్చర్‌

Sat,March 2, 2019 12:52 PM

ED questioned former ICICI Bank chief executive Chanda Kochha

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. బ్యాంకు రుణాల కుంభకోణానికి సంబంధించి ఈడీ నిన్న చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌, వీడియోకాన్‌ డైరక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో చందాకొచ్చర్‌ను అధికారులు నేటి తెల్లవారుజామున 4 గంటల వరకు విచారించారు. తిరిగి వెళ్లిన ఆమె మరలా విచారణ నిమిత్తం ఈ మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అర్థగంట విచారణ అనంతరం ఆమె ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. చందాకొచ్చర్‌ భర్త, వీడియోకాన్‌ మెనేజింగ్‌ డైరక్టర్‌ వేణుగోపాల్‌ ధూత్‌లు విచారణ నిమిత్తం ఇంకా ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నారు.

852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles