భారత ఆర్థిక వృద్ధి టార్గెట్ 8 శాతం : జైట్లీ

Thu,February 1, 2018 11:21 AM

Economy Growth Target is 8 percent, Says Arun Jaitley

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా సంస్కరణలను చేపడుతోందని అరుణ్ జైట్లీ తెలిపారు. ఇవాళ లోక్‌సభలో ఆయన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. విజయవంతమైన సంస్కరణల వల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. చాలా పారదర్శకమైన రీతిలో సహజ వనరులకు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది రెండవ అర్థ భాగంలో ఆర్థికవృద్ధి 7.2 నుంచి 7.5 శాతం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 8 శాతం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. సుపరిపాలనకే తాము ప్రాముఖ్యత ఇస్తామన్నారు. 2014లో తాము ప్రభుత్వం చేపట్టిన క్షణం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ అత్యద్భుతంగా రాణిస్తున్నదని, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఏడవ పెద్దదని ఆయన తెలిపారు. విదేశీ పెట్టుబడులు పెరిగాయని, దాని వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మరింత సులువుగా మారిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.4 ట్రిలియన్లుగా ఉన్నదని ఆయన తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ బిజినెస్ మాత్రమే కాదు, ఈజ్ ఆఫ్ లీవింగ్‌పైన కూడా తాము ఫోకస్ చేశామన్నారు. పంటలకు కనీస మద్దతు ధరను సుమారు 1.5 శాతం పెంచనున్నట్లు ఆయన తెలిపారు.

968
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles