వచ్చే నెలలో మూడు రాష్ట్రాల‌ ఎన్నికలు

Thu,January 18, 2018 01:04 PM

EC announces Assembly Elections Schedule in 3 North Eastern States

న్యూఢిల్లీః మరో ఎన్నికల నగారా మోగింది. ఈసారి మూడు ఈశాన్య రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. సీఈసీ ఏకే జ్యోతి ఎన్నికల ప్రకటన జారీ చేశారు. ఒక్కో రాష్ట్రంలో 60 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ మూడు రాష్ర్టాల్లో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తున్నట్లు సీఈసీ స్పష్టంచేశారు. త్రిపురలో ఒకే విడతలో ఫిబ్రవరి 18న పోలింగ్ జరనున్నది. మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ ఒకే విడతలో ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించారు. అన్ని రాష్ర్టాల కౌంటింగ్ మార్చి 3న జరుగుతుంది. మేఘాలయ ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి మార్చి 6న ముగియనుండగా.. నాగాలాండ్‌లో మార్చి 13న, త్రిపురలో మార్చి 14న ముగియనున్నాయి. ప్రస్తుతం నాగాలాండ్‌లో బీజేపీ మద్దతిస్తున్న నాగా పీపుల్స్ ఫ్రంట్ నేతృత్వంలోని డెమొక్రటిక్ అలయెన్స్ అధికారంలో ఉంది. త్రిపురలో లెఫ్ట్, మేఘాలయలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మధ్యే వరుసగా ఆరోసారి గుజరాత్‌లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈశాన్య రాష్ర్టాల్లోనూ పాగా వేయాలని చూస్తున్నది.


4426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles