రైతు రుణ‌మాఫీకి ఈసీ గ్రీన్‌సిగ్న‌ల్‌

Fri,May 3, 2019 12:17 PM

EC allows Congress led MP government to waive off farmers loans

హైద‌రాబాద్‌: రైతుల రుణాల‌ను మాఫీ చేసేందుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. పోలింగ్ ముగిసిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌చ్చు అని ఇవాళ ఈసీ చెప్పింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో .. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం క‌మ‌ల్‌నాథ్ రైతుల‌కు రుణ‌మాఫీ క‌ల్పించాల‌నుకున్నారు. అయితే ఎన్నిక‌ల నియ‌మావ‌ళి వేళ మాఫీ ఎలా చేస్తార‌ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నించాయి. దీంతో ఈసీని ఆశ్ర‌యించారు. ఎన్నిక‌లు ముగిసిన నియోజ‌క‌వ‌ర్గాల్లోని రైతుల‌కు రుణ‌మాఫీ చేయ‌వ‌చ్చు అని ఈసీ త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా సుమారు 4.5 ల‌క్ష‌ల రైతుల‌కు రుణ‌మాఫీ ల‌బ్ధి జ‌ర‌గ‌నున్న‌ది.

7081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles