బంగాళాఖాతంలో భూకంపం.. చెన్నైలో ప్ర‌కంప‌న‌లు

Tue,February 12, 2019 11:15 AM

Earthquake in Bay of Bengal, mild tremors felt in parts of Chennai

చెన్నై: బంగాళాఖాతంలో ఇవాళ భూకంపం సంభ‌వించింది. చెన్నైకు ఈశాన్య దిక్కున సుమారు 600 కిలోమీట‌ర్ల దూరంలో ఈ భూకంపం న‌మోదు అయ్యింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 5.1గా న‌మోదైంది. దీంతో చెన్నై మ‌హాన‌గ‌రంలోనూ స్వ‌ల్పంగా ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయ్యాయి. తీరం స‌మీపంలో ఉన్న అనేక ప్రాంతాల్లోనూ స్వ‌ల్ప స్థాయిలో ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇవాళ ఉద‌యం 7 గంట‌ల‌కు భూకంపం వ‌చ్చింది. చెన్నై ప్ర‌జ‌లు త‌మ సోష‌ల్ మీడియాలోనూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.2235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles