ఇక భూమి.. నీలి రంగులో క‌నిపించ‌దు..

Thu,February 7, 2019 02:56 PM

Earth may not appear as blue in another 80 years: MIT study

హైద‌రాబాద్: వాతావ‌ర‌ణ మార్పులు.. భూమి వ‌ర్ణాన్ని మార్చ‌నున్నాయి. 21వ శ‌తాబ్ధం చివ‌రిలోగా స‌ముద్రాలు త‌మ రంగును కోల్పోయే ప్ర‌మాదం ఉంది. మ‌రో 80 ఏళ్ల త‌ర్వాత‌ నీలి రంగు భూ గ్ర‌హం మ‌రో రంగులో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు అమెరికాకు చెందిన మ‌సాచుటెస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నిర్వ‌హించిన స్ట‌డీలో తేలింది. స‌ముద్రంలోని సూక్ష్మ జీవాలు, వృక్షాలు వాతావ‌ర‌ణ ప్ర‌భావానికి లోనుకానున్న‌ట్లు ఆ ప‌రిశోధ‌న వెల్ల‌డించింది. భూమిపై క‌నిపించే నీలి, హ‌రిత ప్రాంతాలు ఇక త‌మ ప్ర‌భ‌ను కోల్పేయే అవ‌కాశాలు ఉన్న‌ట్లు స్ట‌డీలో తేల్చారు. 21వ శ‌తాబ్ధం చివ‌ర వ‌ర‌కు దాదాపు 50 శాతం స‌ముద్రాల రంగు మార‌నున్న‌ట్లు ఆ ప‌రిశోధ‌న నిర్వ‌హించిన స్టీఫెన్ డుకెవిజ్ తెలిపారు. వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల స‌ముద్రాల్లో సూక్ష్మ జీవాలు వెలుతురు గ్ర‌హించే తీరును మార్చుకుంటాయి, దాంతో ఫుడ్ సైకిల్ కూడా మారుతుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. స‌బ్‌ట్రాపిక్ ప్రాంతాల్లో ఉండే నీలి రంగు ప్ర‌దేశాలు త‌మ ప్ర‌కాశ గుణాన్ని కోల్పోనున్నాయి. ద్రువాల వ‌ద్ద ఉన్న హ‌రిత ప్రాంతాలు వేడెక్కిన వాతావ‌ర‌ణం వ‌ల్ల తెల్ల‌బోనున్నాయి.
.

1682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles