ట్రంప్‌ను మోదీ అడ‌గ‌లేదు: జైశంక‌ర్‌

Tue,July 23, 2019 11:45 AM

EAM S Jaishankar clarifies in Rajya Sabha over the statement of US President Donald Trump on Kashmir issue

హైద‌రాబాద్‌: క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించ‌మ‌ని ట్రంప్‌ను మోదీ కోర‌లేద‌ని ఇవాళ విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. రాజ్య‌స‌భ‌లో ఈ అంశంపై ఆయ‌న మాట్లాడారు. పాక్‌తో ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ద్వైపాక్షికంగానే చ‌ర్చిస్తామ‌ని మంత్రి తెలిపారు. సీమాతంర ఉగ్ర‌వాదం నిలిపివేస్తేనే చ‌ర్చ‌లు సాధ్య‌మ‌న్నారు. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్ డిక్లరేష‌న్ ప్ర‌కార‌మే ప‌రిష్కారం అవుతాయ‌న్నారు. అయితే స‌భ్యుల నినాదాల మ‌ధ్య స‌భ‌ను 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. క‌శ్మీర్ స‌మ‌స్య జాతీయ అంశ‌మ‌ని, జాతి ఐక్య‌తకు సంబంధించిన అంశంపై ఒకే గొంతు వినిపించాల‌ని చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తెలిపారు.538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles