పండుగ చేసుకున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.. 15 వేల కోట్ల బిజినెస్

Tue,October 16, 2018 10:08 AM

E-Commerce sites Flipkart and Amazon amassed 15000 crores in 5 day sale period

ముంబై: దసరా, దీపావళి పండుగలు ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు ముందే వచ్చేశాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఐదు రోజుల పాటు జరిగిన విషయం తెలిసిందే. రెండు సైట్లు కలిపి మొత్తం రూ.15 వేల కోట్ల బిజినెస్ చేయడం విశేషం. రెడ్‌సీర్ కన్సల్టింగ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2017లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రూ.10,325 కోట్ల బిజినెస్ చేశాయి. ఈసారి అది 64 శాతం పెరిగింది. టైర్ టూ సిటీస్ నుంచి బిజినెస్ పెరగడంతో ఈసారి భారీ మొత్తం వచ్చినట్లు రెడ్‌సీర్ చెప్పింది. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ అయితే తొలి 36 గంటల్లోనే గతేడాది మొత్తం సేల్స్‌ను అందుకోవడం విశేషం. ఈ ఏడాది కొత్తగా చిన్న చిన్న టౌన్ల నుంచి 80 శాతం కొత్త కస్టమర్లు వచ్చినట్లు అమెజాన్ వెల్లడించింది. ఇక విలువ పరంగా స్మార్ట్‌ఫోన్లు, సంఖ్య పరంగా ఫ్యాషన్ ఐటమ్స్ ఎక్కువగా అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ చెప్పింది.

ఇక కొత్తగా అమెజాన్ హిందీ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయగా.. అందులోనూ సాధారణ రోజులతో పోలిస్తే సేల్ రోజుల్లో కస్టమర్ల సంఖ్య 2.4 రెట్లు ఎక్కువగా వచ్చింది. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ గతంలోని అన్ని రికార్డులను తిరగ రాసిందని ఆ సంస్థ వెల్లడించింది. మొత్తం దేశంలోని ఈ-కామర్స్ బిజినెస్‌లో 70 శాతం ఫ్లిప్‌కార్ట్‌లోనే జరిగినట్లు తెలిపింది. ఇక కేటగిరీ వారీగా చూస్తే ఫ్యాషన్ మార్కెట్‌లో 85 శాతం, భారీ హోమ్ అప్లయెన్సెస్‌లో 75 శాతం, ప్రతి నాలుగు స్మార్ట్‌ఫోన్లలో మూడు ఫ్లిప్‌కార్ట్‌లోనే అమ్ముడైనట్లు ఆ సంస్థ చెప్పింది. కొత్త కస్టమర్ల సంఖ్య 50 శాతం పెరిగినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. సేల్ రోజుల్లో ఒక రోజు 2.5 కోట్ల మంది తమ సైట్‌లో ఉన్నట్లు చెప్పారు. ఇక పేటీఎం మాల్‌లో 1.2 కోట్ల వస్తువులు అమ్ముడుపోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

1858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles