మద్యం మత్తులో తండ్రిని చంపిన తనయుడు

Thu,June 13, 2019 11:21 AM

Drunk son stabs father to death with pair of scissors in Haryana

హైదరాబాద్‌ : మద్యం మత్తులో ఉన్న ఓ కుమారుడు తన తండ్రిని చంపేశాడు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని కర్నాల్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. 15 ఏళ్ల వయసున్న యువకుడు పీకల దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న కుమారుడిని.. మద్యం ఎందుకు సేవిస్తున్నావని తండ్రి సోమనాథ్‌(40) ప్రశ్నించాడు. ఈ క్రమంలో తండ్రికొడుకుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం కత్తిపోట్ల దాకా దారి తీసింది. తండ్రి సోమనాథ్‌ను కుమారుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అనంతరం అతను పారిపోయాడు. సోమనాథ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

2170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles