హిట్ అండ్ రన్ కేసు..గంటలో డ్రైవర్ అరెస్ట్

Wed,May 15, 2019 04:58 PM


జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లాలో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదికొచ్చింది. పల్లాడ్ గ్రామానికి చెందిన సన్సార్ సింగ్ అనే డ్రైవర్ ఇవాళ ఉదయం జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై ట్రక్కును అతివేగంగా తీసుకెళ్లి..ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే డ్రైవర్ సన్సార్ సింగ్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని చెక్‌పాయింట్లను అప్రమత్తం చేశారు. గంట వ్యవధిలోనే తనిఖీల బృందం ఖరోటే మోర్హ్ సమీపంలో డ్రైవర్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుందని పంజాబ్ అధికారి బల్కర్ సింగ్ తెలిపారు.

1609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles