నువ్వు శివుడి అవతారానివా.. అయితే విషం తాగి బతుకు చూద్దాం!

Mon,March 25, 2019 05:47 PM

Drink poison and survive BJP ministers challenge to Congress President Rahul Gandhi

అహ్మదాబాద్: ఎన్నికల వేళ మరో బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆ పార్టీ కార్యకర్తలు శివుడి అవతారంగా చూడటాన్ని ప్రస్తావిస్తూ.. నువ్వు నిజంగా శివుడి అవతారమే అయితే.. 500 గ్రాముల విషయం తాగి బతుకు చూద్దాం అంటూ గుజరాత్‌కు చెందిన మంత్రి గణపత్ వాసవ సవాలు విసిరారు. శివుడు తన భక్తులను కాపాడటం కోసం విషాన్ని మింగుతాడు. మరి అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ నేతతో 500 గ్రాముల విషాన్ని తాగించండి. ఆయన బతికితే నిజంగా శివుడి అవతారమే అనుకుంటాం అని గణపత్ అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని మండిపడింది. ఈ మధ్యే మంత్రి గణపత్ కాంగ్రెస్ లక్ష్యంగా కొన్ని విమర్శలు చేశారు. బాలాకోట్‌పై దాడిని కాంగ్రెస్ ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేసినప్పుడు కాంగ్రెస్ నేత ఒకరిని ఆ ఫైటర్ జెట్‌కు కట్టి పంపాలి అని అనడం వివాదాస్పదమైంది.

4083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles