సెకన్ల వ్యవధిలో కుప్పకూలిన ఇల్లు.. వీడియో

Fri,August 17, 2018 02:46 PM

Dramatic House Collapse After Rain In Karnataka Kodagu

బెంగళూరు : కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటకలో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. కొడ్‌గావ్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. వరద నీరు కాలనీల్లోకి చేరడంతో.. పలు నివాసాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పలు భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ రెండు అంతస్తుల భవనం సెకన్ల వ్యవధిలో కుప్పకూలిపోయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. భవనం కూలుతున్న సమయంలో అక్కడున్న వారంతా తమ ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగెత్తారు. 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1700 మందికి పైగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

5076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles