63 మంది చిన్నారులు మృతి.. డాక్ట‌ర్‌కు క్లీన్ చిట్‌

Fri,September 27, 2019 03:15 PM

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రెండేళ్ల క్రితం 63 మంది శిశువులు చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. 2017 ఆగ‌స్టులో గోర‌ఖ్‌పూర్‌లోని బీఆర్డీ మెడిక‌ల్ కాలేజీ హాస్ప‌ట‌ల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా త‌క్కువ కావ‌డం వ‌ల్ల చిన్నారులు మ‌ర‌ణించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో అదే ఏడాది డాక్ట‌ర్ ఖ‌ఫీల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. చిన్నారుల మృతిపై విచార‌ణ చేప‌ట్టేందుకు ఏర్పాటు చేసిన క‌మిష‌న్ తాజాగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదిక‌లో పీడియాట్రిక్‌ డాక్ట‌ర్ ఖ‌ఫీల్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు. చిన్నారుల మ‌ర‌ణం కేసులో ఎటువంటి వైద్య నిర్ల‌క్ష్యం లేద‌ని నివేదిక స్ప‌ష్టం చేసింది. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, టెండ‌ర్‌, మెయిన్‌టేనెన్స్‌, పేమెంట్ అంశాల్లో డాక్ట‌ర్ పాత్ర లేద‌ని క‌మిటీ తేల్చింది. ఈ కేసులో డాక్ట‌ర్ ఖ‌ఫీల్ ఇంకా స‌స్పెన్ష‌న్‌లోనే ఉన్నాడు. క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో ప్ర‌మాదం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డాక్ట‌ర్ ఖ‌ఫీల్ డిమాండ్ చేశాడు. ఐఏఎస్ ఆఫీస‌ర్ హిమాన్షు కుమార్ నివేదిక‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లోనే త‌న రిపోర్ట్‌ను ఇచ్చారు. యూపీ సీఎం ఆదిత్య‌నాథ్ స్వంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన గోరఖ్‌పూర్‌లో ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ కేసులో మొత్తం 9 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.

6645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles