64 ఏండ్ల వ్యక్తికి రెండు జీవితఖైదులు

Thu,October 11, 2018 06:30 PM

Double life term imposed on 64 years old man in TN

తంజావూరు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన 64 ఏండ్ల వ్యక్తికి తంజావూరు కోర్టు రెండు జీవితఖైదులు విధిస్తూ తీర్పునిచ్చింది. రామాయన్ అనే వ్యక్తి ఒరతనాడుకు చెందిన రైతు. 2012లో రామాయన్ పదకొండేళ్ల బాలికకు మాయమాటలు ఆమెపై లైంగిక దాడి చేశాడు. దీంతో బాధిత బాలికను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ బాలికకు సుఖవ్యాధి సంక్రమించినట్లు వైద్యులు నిర్దారించారు. పోస్కో యాక్ట్ కింద రామాయన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో తంజావూరు మహిళా కోర్టు న్యాయమూర్తి బాలక్రిష్ణన్ నిందితుడికి రెండు జీవితఖైదులు, రూ.2500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

2403
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles