చ‌ట్టంతో ఆట‌లొద్దు.. 10 కోట్లు కట్టి బ‌యిటికెళ్లు

Wed,January 30, 2019 01:29 PM

Don�t Play With the Law, supreme court warns Karthi Chidambaram

న్యూఢిల్లీ: చీటికిమాటికి విదేశాల‌కు వెళ్తున్న కార్తీ చిదంబ‌రంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కోర్టు అత‌న్ని తీవ్రంగా మంద‌లించింది. విచార‌ణా సంస్థ‌ల‌కు స‌హ‌క‌రించ‌డం లేదంటూ అత‌నిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. చ‌ట్టంతో ఆట‌లాడుకోవ‌డం మంచిది కాదు అని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ విధంగా స్పందించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబ‌రం.. వాస్త‌వానికి ఈడీ చేప‌డుతున్న విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డంలేదు. కోర్టు అనుమ‌తుల‌తోనే ప‌దేప‌దే విదేశాల‌కు వెళ్తున్నాడు. మ‌ళ్లీ ఫిబ్ర‌వ‌రిలో విదేశాల‌కు వెళ్లేందుకు అత‌ను సిద్ధ‌మ‌య్యాడు. ఈ నేప‌థ్యంలో కోర్టు అత‌నిపై సీరియ‌స్ అయ్యింది. ఇవాళ కార్తీ పిటిష‌న్‌ను సీజేఐ ప‌రిశీలించారు. దానిపై ఆయ‌న స్పందిస్తూ.. చ‌ట్టంతో ఆట‌లాడుకోవ‌ద్దు అని, ఇప్పటివ‌ర‌కు ఈ కేసులో స‌హ‌క‌రించ‌లేద‌ని, ఇక నుంచి ఏ విధంగా స‌హ‌క‌రించ‌కున్నా ఊరుకునేది లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ స‌హ‌క‌రించుకుంటే కోర్టు తీవ్ర చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని సీజేఐ వార్నింగ్ ఇచ్చారు. ఏ దేశానికి వెళ్లాల‌నుకుంటే, అక్క‌డికి వెళ్లు, కానీ విచార‌ణ‌కు మాత్రం క‌చ్చితంగా హాజ‌రుకావాల‌ని ఆదేశించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మ‌ళ్లీ మార్చి 5,6,7, 12 తేదీల్లో కార్తీ విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే విదేశాల‌కు వెళ్లే ముందు 10 కోట్లు డిపాజిట్ చేయాల‌ని కోర్టు కార్తీకి సీరియ‌స్‌గా చెప్పింది. తండ్రి పి. చిదంబ‌రం కేంద్ర మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అక్ర‌మ ప‌ద్ధ‌తిలో కొన్ని సంస్థ‌ల‌కు కార్తీ ప‌ర్మిష‌న్లు ఇప్పించాడు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసుల‌ను సీబీఐ, ఈడీ విచారిస్తోంది.

2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles