వీడియో: ద‌ర్జాగా ఆటో మీద ప్ర‌యాణిస్తున్న కుక్క‌..!

Sat,October 14, 2017 07:10 PM

Dog stands on top of Auto video goes viral

వాహనాల మీదికి ఎక్కి ఎంతో పోజు కొడుతూ చాలా మంది ప్రయాణిస్తుంటారు. అంత వరకు ఓకే. మరి.. ఓ కుక్క వాహనంపైకి ఎక్కి పోజు కొడితే ఎలా ఉంటది అంటే.. ఇగో ఇలా ఉంటది. ముంబైలో సుల్తాన్ అనే కుక్కకు ఓ స్పెషాలిటీ ఉంది. అందుకే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దానికి ఓ వింత అలవాటు ఉందట. తన ఓనర్ ఎప్పుడూ ఆటో తీసినా.. అది ఆటోలో కూర్చోకుండా.. ఆటో మీదికి ఎక్కి ప్రయాణిస్తుందట. ఇలా చాలా సార్లు అది ఆటో పైన ఎక్కి ప్రయాణించిందట.

ఎంతో దర్జాగా... ఏ మాత్రం భయం లేకుండా.. ఆటో ఎంత స్పీడ్‌గా వెళ్లినా... అలాగే స్టెడీగా నిలుచుంటుందట. అయితే.. రోడ్డు మీదికి వెళ్లినప్పుడు మాత్రం చాలామంది ఆటో పైన ప్రయాణిస్తున్న ఈ కుక్కను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ముంబైకి చెందిన ఆర్జే మలిష్క ఈ కుక్క వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అయితే.. నెటిజన్లలో కొందరు మాత్రం.. ఇది చాలా డేంజరస్ స్టంట్ అని.. ఇటువంటి ప్రయాణం కుక్కకు ఎంతో ప్రమాదకరమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం కుక్క స్టంట్స్ బాగున్నాయంటూ కితాబిస్తున్నారు.


4178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS